తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2020, 11:00 AM IST

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రారంభించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో కలిసి.. రైతులకు స్క్రినింగ్‌ టెస్టులు నిర్వహించి మాస్కులు పంపిణి చేశారు.

mla attram sakku start grain buying center rebbana
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమికూడకుండా సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులకు మాస్కుల పంపిణితో పాటు స్క్రినింగ్‌ టెస్టులు నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీరు, సబ్బులు, శానిటైజార్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వడ్లకు ప్రభుత్వం రూ.1835తో గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. వడ్లను ఎండబెట్టి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు.

ఇదీ చదవండి:కడుపుపై కొట్టిన కరోనా... పనిలేక పేద బతుకులు విలవిల

ABOUT THE AUTHOR

...view details