తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకట్టుకున్న ఆదీవాసీల సంప్రదాయ వివాహ వేడుక - తెలంగాణ వార్తలు

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గౌరీ గ్రామంలో జరిగిన ఆదివాసీ వివాహ వేడుక ఆకట్టుకుంది. వరుడు గుర్రంపై రావడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ వివాహానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు.

adivasi marriage, athram sakku in adivasi marriage
ఆదివాసీ పెళ్లి వేడుక, ఆదివాసీ పెళ్లిలో ఆత్రం సక్కు

By

Published : Apr 10, 2021, 3:58 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గౌరీ గ్రామంలో ఆదీవాసీల సంప్రదాయ వివాహ వేడుక ఆకట్టుకుంది. డోలు వాయిద్యాల నడుమ పెళ్లికొడుకు గుర్రంపై రావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆదీవాసీలు సంప్రదాయ వేషాధారణతో, నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు.

ఆదివాసీ పెళ్లి వేడుక, ఆదివాసీ పెళ్లిలో ఆత్రం సక్కు

ఈ వివాహ వేడుకకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కుటుంబసమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించి.. కానుకలు అందజేశారు. ఈ వివాహానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు హాజరయ్యారు.

ఇదీ చదవండి:వేసవిలో సేద తీరుతున్న అందాల భామలు!

ABOUT THE AUTHOR

...view details