రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకపూర్ వద్ద రైతు వేదిక నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జడ్పీ ఛైర్పర్సన్ భూమి పూజ చేశారు. రైతులకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సంబంధ సూచనలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి క్లస్టర్లో రైతు వేదికలు నిర్మిస్తోందన్నారు.
'రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది' - ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
రైతులకు ఆధునిక వ్యవసాయంపై శిక్షణ, సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ప్రభుత్వం నిర్మిస్తోందని కుమురంభీం ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్పర్సన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో రైతు వేదిక నిర్మాణానికి వారు భూమిపూజ చేశారు.
!['రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది' mla and zp chairperson laid foundation for the farmer's platform in kumurambheem asifabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7975089-1053-7975089-1594399058719.jpg)
'రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'
ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ నిధులతో వేదికలు నిర్మిస్తోందని తెలిపారు. అన్నదాతలు రైతువేదికలను సక్రమంగా ఉపయోగించుకొని లాభదాయక పంటలు పండించాలని అన్నారు.
ఇవీ చూడండి:రేణికుంటలో రైతు వేదిక శంకుస్థాపనకు విస్తృత ఏర్పాట్లు