'గిరిజనులు అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని' గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఎన్జీఓ కాలనీలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన సముదాయనికి శంకుస్థాపన చేశారు. మంత్రికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘన స్వాగతం పలికారు. రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
గిరిజనుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మంత్రి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను నెలకొల్పారన్నారు.