అటవీ ప్రాంతం క్రమంగా మైదాన ప్రాంతంగా మారుతోంది. ఫలితంగా అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి రావడం ఆందోళనకు దారితీస్తోంది. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాలో పులిదాడిలో ఇద్దరు మృతి చెందటం పట్ల.. అటవీ ప్రాంత ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొండపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.
పులి దాడిచేయకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం: ఇంద్రకరణ్‌రెడ్డి - Minister Indira Reddy visited the forest area
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో నవంబర్ 11న విఘ్నేష్‌ను, నవంబర్ 29న పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో నిర్మల అనే యువతిని పెద్దపులులు హతమార్చడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. స్వయంగా అటవీశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి ప్రత్యేక బందోబస్తు మధ్య.. ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మారుమూలన ఉన్న కొండపల్లిని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పులులతోపాటు ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తామంటున్న మంత్రితో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.
పులి దాడిచేయకుండా ప్రజల్లో అవగాహన కల్గిస్తున్నాం: ఇంద్రకరణ్‌రెడ్డి
పులి దాడిచేయకుండా ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నామని మంత్రి తెలిపారు. పులుల దాడుల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు. అంతరించిన అడవికి పూర్వవైభవం, పోడు భూముల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.
ఇదీ చూడండి :ప్రతి పల్లె ఆ గ్రామంలా కావాలని కేసీఆర్ సూచన