భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శల వర్షం గుప్పించారు.
'హిందూ దేశంగా మార్చేందుకు భాజపా కుట్ర' - MIM leader Asaduddin Owaisi Election Campaign in Khakaznagar
పురపాలిక ఎన్నికల్లో భాగంగా కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. ముస్లిం మైనార్టీ సోదరులు అంతా కలిసి ఎంఐఎం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
!['హిందూ దేశంగా మార్చేందుకు భాజపా కుట్ర' MIM leader Asaduddin Owaisi Election Campaign in Khakaznagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5736002-12-5736002-1579193459638.jpg)
'హిందూ దేశంగా మార్చేందుకు భాజపా కుట్ర'
భారతదేశం ఏ ఒక్క మతానికి సొంతం కాదని... డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయని వెల్లడించారు. ముస్లిం మైనార్టీ సోదరులు అంతా కలిసి ఎంఐఎం అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.
'హిందూ దేశంగా మార్చేందుకు భాజపా కుట్ర'
ఇవీచూడండి : ఎంఐఎం చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ: కిషన్ రెడ్డి