తమకు రావాల్సిన కూలీలు చెల్లిస్తే తమ సొంత ఊర్లకు వెళ్లిపోతామని సుమారు 100 వలస కూలీలు కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్(ఎస్‌పీఎం) పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి గుత్తేదారు తమకు కూలీలు సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు రావాల్సిన కూలీ బకాయిలు చెల్లిస్తే సొంతూళ్లకు వెళ్లిపోతామన్నారు.
ఎస్‌పీఎం ఎదుట వలస కూలీల ఆదోళన - సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల ఆదోళనలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్‌పీఎం పరిశ్రమ మందు సుమారు 100మంది కార్మికులు ఆందోళనలకు దిగారు. తమ కూలీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎస్‌పీఎం ఎదుట వలస కూలీల ఆదోళన
రెండు మూడు రోజుల్లో ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తామని గుత్తేదారు హామీ ఇవ్వగా కార్మికులు ఆందోళనలు విరమించారు.
ఇదీ చూడండి:'దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు'