తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్‌.. ఎగిసి పడుతున్న నీరు - మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ వార్తలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్‌తో భారీఎత్తున నీరు వృధా అవుతోంది. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇంత వరకు స్పందించలేదని స్థానికులు తెలిపారు.

Massive water wastage due to leakage of Mission Bhagiratha pipeline
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్‌.. ఎగిసి పడుతున్న నీరు

By

Published : Feb 12, 2021, 4:07 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి శివారులోని జాతీయ రహదారికి పక్కన గల... మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవడంతో భారీఎత్తున నీరు వృధా అవుతోంది.

అధికారులకు సమాచారమిచ్చిన ఇంతవరకు స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు. ఇంతో విలువైన మంచినీరు వృధా అవుతోందని తెలిపారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తున్న జలధారను ఆ దారిలో వెళ్తున్న వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నారు.

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్‌.. ఎగిసి పడుతున్న నీరు

ఇదీ చదవండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details