కార్తిక మాసం పురస్కరించుకుని కాగజ్నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపారు. వ్రతంలో పాల్గొన్న జంటలకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్... స్వామి వారి వెండి ప్రతిమలు అందజేయగా... ఎస్పీఎం పరిశ్రమ ప్రతినిధి.. వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ ఇందారపు రాజేశ్వర్, ఈవో వామన్, తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు - కాగజ్నగర్ శివ మల్లన్న ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవోపేతంగా నిర్వహించారు.
మల్లన్న ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు