కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 124 పేద గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. మండలంలోని సోమిని గ్రామంలో ప్రాణహిత నది తీరాన సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులతో ఈ జంటలు ఒక్కటయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవలక్ష్మి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం నగేశ్ తదితరులు హాజరయ్యారు.
సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో ఒక్కటైన 124 జంటలు - 116 జంటలకు ఒకేసారి పెళ్లి
కుమురం భీం జిల్లా బెజ్జూర్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 124 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నూతన వధూవరులకు పెళ్లి కానుకగా దాతల సహాయంతో గృహోపకరణాలను సైతం అందిస్తున్నట్లు తెలిపారు.
![సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో ఒక్కటైన 124 జంటలు mass-marriages-in-kumuram-bhim-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6050667-thumbnail-3x2-kee.jpg)
సామూహిక వివాహాలకు హాజరైన అతిథులకు ఎమ్మెల్యే సతీమణి రమాదేవి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఎమ్మెల్యే దంపతులు, అతిథులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య 124 జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. నూతన వధూవరులకు పెళ్లి కానుకగా దాతల సహాయంతో గృహోపకరణాలను సైతం అందిస్తున్నట్లు తెలిపారు. సామూహిక వివాహాల్లో ఒక్కటైన జంటలకు ప్రభుత్వం తరఫున కల్యాణలక్ష్మి పథకం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :అయోధ్య గుడికి బ్రహ్మాండమైన డిజైన్- 19న నిర్ణయం!