కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పారిశ్యుద్ధ్య కార్మికులకు డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ వారి ఆధ్వర్యంలో మాస్కులు, సానిటైజర్లు అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, పురపాలక కమిషనర్ రవికృష్ణ పాల్గొన్నారు.
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం' - LOCK DOWN EFFECTS
కరోనా వేళ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఆసిఫాబాద్ పట్టణ ఎస్ఎచ్ఓ, పురపాలక కమిషనర్ కొనియాడారు. కార్మికులకు మాస్కులు, సానిటైజర్లు అందించారు.
!['పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం' MASKS DISTRIBUTION TO SANITATION EMPLOYEES ON KUMURAM BHEEM DISTRICT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6881160-671-6881160-1587463145745.jpg)
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం'
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్న వేళ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు అనునిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.
ఇవీ చూడండి:కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?