కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పెద్దవాగు తీరాన ఉన్న కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి మరో కొండగట్టు పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ కొలువైన వీరాంజనేయుడిని భక్తులకు కొంగు బంగారంగా చెప్పుకుంటారు. మహిమాన్వితమైన ఈ ఆలయం భక్తులచే విశేష ఆదరణ పొందుతోంది. నిత్య పూజలు, ఉత్సావాలతో ఈ క్షేత్రం భక్తి పరిమళాలను వెదజల్లుతోంది. చైత్ర పౌర్ణమి నాటి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 40 రోజులపాటు వందలాది మంది భక్తులు హనుమాన్ దీక్షలు చేపడతారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
మరో కొండగట్టుగా ఆసిఫాబాద్ వీరాంజనేయ ఆలయం - కుమురం భీం ఆసిఫాబాద్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కేస్లాపూర్‌లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి