తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిహారం... కొందరికి రూ.లక్షలు... మరికొందరికి రూ.కోట్లు!

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించడంలో అవకతవకలు జరిగాయని బాధితులు వాపోయారు. రెవెన్యూ అధికారుల ఇష్టానుసారం సర్వే చేసి అక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. కొందరికి రూ.లక్షల్లో పరిహారం ఇవ్వగా మరికొందరికి రూ.కోట్లలో ఇస్తున్నారని ఆరోపించారు.

manipulations-in-compensation-of-nhai-constriction-in-komaram-bheem-district
పరిహారంలో కొందరికి రూ.లక్షలు... మరికొందరికి రూ.కోట్లు!

By

Published : Jan 5, 2021, 12:26 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా... భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడంలో అవకతవకలు జరిగాయని బాధితులు అంటున్నారు. రెవెన్యూ అధికారుల ఇష్టానుసార సర్వే కారణంగా భూమిని కోల్పోతున్న తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ విలువ ప్రకారం కాకుండా పక్క పక్కనే ఉన్నవారిలో కొందరికి రూ.లక్షల్లో పరిహారం రాగా, మరికొందరికి రూ.కోట్లలో పరిహారం ఇచ్చారని బాధితులు ఆరోపించారు.

ఆసిఫాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 235/బిలో ప్రవీణ్ కుమార్​కు చెందిన జిన్నింగ్ మిల్లు ఉంది. ఇక్కడ 34 గుంటల భూమికి రూ.1.57 లక్షల పరిహారం ఇవ్వగా అర కిలోమీటర్ దూరంలో ఉన్న సర్వే నంబర్ 9, 10లో 30 గుంటల భూమికి ఏకంగా రూ.4.27 కోట్లు పరిహారంగా చెల్లించారని తెలిపారు.

కుమురం భీం ప్రాజెక్ట్ ముంపులో భాగంగా భాగ్యనగర్​లో 70 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. నాలుగు వరుసల రహదారి వల్ల తమకు అతితక్కువ పరిహారం ఇస్తున్నారని... మళ్లీ ఇక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:భయం భయం: హడలెత్తిస్తున్న చిరుతల సంచారం

ABOUT THE AUTHOR

...view details