కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామానికి చెందిన కోవా జలపతి రావు (55) అనే గిరిజనుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. జలపతి రావు అతని కుమారుడు మానిక్ రావు వాంకిడిలోని ఒక ప్రైవేటు పత్తి కొనుగోలు కేంద్రంలో 6.77 కిలోల పత్తిని విక్రయించారు. అనంతరం ఇరువురు ఆటోలో ఇంటికి వచ్చే క్రమంలో వాంకిడి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్నా ఖేడేగామ్కు చెందిన కొరవేత బొజ్జి రావు.. జలపతి రావును తనతో పాటు తీసుకువస్తానని ఇంటికి వెళ్లమని మృతుడి కుమారుడు మానిక్ రావును ఇంటికి పంపించాడు.
55 ఏళ్ల వ్యక్తి అనుమానస్పద మృతి - కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్కేపల్లిలో 55 ఏళ్ల వ్యక్తి అనుమానస్పదంగా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

55 ఏళ్ల వ్యక్తి అనుమానస్పద మృతి
రాత్రి వరకు జలపతి రావు ఇంటికి రాకపోవడం వల్ల బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. మంగళవారం ఉదయం దారి వెంట వెళ్లిన వారికి జలపతి రావు మృతదేహం కనిపించడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల, మొహంపై కర్రతో బాది హత్య చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. రాత్రి వరకు జలపతి రావుతో వెంట ఉన్న వీఆర్ఏను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి:బిల్డింగ్ పైనుంచి పడి వ్యక్తి మృతి