రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు - man heavily injured
నిర్లక్ష్యంగా ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా... రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఘటన కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది.
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అశోక్ కాలనీకి చెందిన గాజుల రాజేష్ పట్టాలు దాటుతుండగా రామగిరి ప్యాసింజర్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు రాజేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాధితుడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.