కుమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన నాగమ్మ కోడలితో కలిసి నివాసముంటోంది. కొడుకు దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తుండగా... భర్త గతంలోనే మృతి చెందాడు.
ఆర్మీ జవాన్ తల్లిపై దౌర్జన్యం.. భూమి తనదేనంటూ దాడి
తమ ఇంటివద్ద విత్తనాలు వేసుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చి విత్తనాలు వేయొద్దు.. ఈ భూమి నాది అంటూ మహిళపై దాడికి దిగిన ఘటన కుమురం భీం జిల్లా కౌటాల మండలంలో చోటు చేసుకుంది.
భూమి తనదేనంటూ ఆర్మీజవాన్ తల్లిపై వ్యక్తి దాడి
సోమవారం ఉదయం నాగమ్మ తన ఇంటి వద్ద పెరట్లో కూరగాయలకు విత్తనాలు వేస్తుండగా... అదే గ్రామానికి చెందిన కమలాకర్ ప్రకాశ్‌రావు అక్కడికి వచ్చాడు. మీరు నివాసముంటున్న భూమి తనదేనంటూ వాళ్లతో వాగ్వాదానికి దిగాడు. విత్తనాలు వేయొద్దని నాగమ్మను దూషిస్తూ... ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనలో నాగమ్మకు గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శివాజీ తెలిపారు.
ఇవీ చూడండి:పుల్వామాలో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం