కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవన్ సమీపంలో కోటి రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ సేవాదళం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీ ఆర్ మల్లికార్జున్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంక్షేమ భవన నిర్మాణం కోసం గతంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మీ భూమి పూజ చేశారని చెప్పారు. కానీ ఆ స్థలాన్ని దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు ఇస్లాం హసన్‌తో పాటు విలేఖరి అబ్దుల్ రెహమాన్ ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకుంటున్నారని ఆరోపించారు.
'కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' - కేసీఆర్ సేవాదళం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీ ఆర్ మల్లికార్జున్
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేసిన తనపై అక్రమార్కులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కేసీఆర్ సేవాదళం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీ ఆర్ మల్లికార్జున్ తెలిపారు. వారిపై వెంటనే చర్యలు తీసుకొని తనను కాపాడాలని కోరారు.
!['కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' latest land issue in kumuram bheem asifabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8351467-23-8351467-1596951971670.jpg)
ఈ భూములకు సంబంధించిన వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా అది ప్రభుత్వ అని నిర్ధారిస్తూ... తహసీల్దార్ సమాచారం ఇచ్చారని మల్లికార్జున్ పేర్కొన్నారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. రాత్రి తనను చంపుతానని ఇస్లాం బీన్ హసన్‌తో పాటు అబ్దుల్ రెహమాన్‌లు బెదిరింపులకు పాల్పడ్డారని మల్లికార్జున్ వివరించారు. వెంటనే విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత