రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కి చెందిన కూలీలు రవాణా సౌకర్యంలో లేకపోవడం వల్ల సైకిళ్ల మీద స్వస్థలానికి బయలుదేరారు. ఉదయం 6 గంటలకు బయలుదేరిన వీరు మధ్యాహ్ననికి కాగజ్‌నగర్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ బాబు వారికి భోజన సదుపాయం కల్పించారు. తమ సొంతూరుకు చేరుకోవాలంటే నాలుగు రోజులు పడుతుందని కూలీలు తెలిపారు.
సైకిళ్లపై స్వస్థలానికి బయలుదేరిన మధ్యప్రదేశ్ కూలీలు - కరోనా ఎఫెక్ట్
లాక్డౌన్ వల్ల వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు కూలీలు సైకిళ్లపై సొంతూళ్లకు బయల్దేరారు. మార్గమధ్యలో కాగజ్‌నగర్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు భోజన వసతి కల్పించారు.
![సైకిళ్లపై స్వస్థలానికి బయలుదేరిన మధ్యప్రదేశ్ కూలీలు Madhya Pradesh coolies who go home on bicycles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6572846-thumbnail-3x2-cycle.jpg)
సైకిళ్లపై స్వస్థలానికి బయలుదేరిన మధ్యప్రదేశ్ కూలీలు
సైకిళ్లపై స్వస్థలానికి బయలుదేరిన మధ్యప్రదేశ్ కూలీలు
ఇవీ చూడండి:ఆకలితో ఎవరూ ఉండకూడదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్