కరోనా కట్టడి దృష్ట్యా నేటి నుంచి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో.. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉదయం పూట సందడి నెలకొంది. 6 గంటలకే వ్యాపార సముదాయాలన్నీ తెరుచుకున్నాయి. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు వేకువజామునే మార్కెట్కు చేరుకున్నారు.
నిత్యావసరాల కోసం దుకాణాల వద్ద రద్దీ - కుమురం భీం జిల్లా కరోనా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం నేటి ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ను ప్రకటించడంతో.. ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఎటు చూసినా రద్దీ రహదారులే కనిపించాయి. పండ్లు, కూరగాయల మార్కెట్లు ప్రజలతో నిండిపోయాయి.
lockdown in kagazanagar
ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. పండ్లు, కూరగాయల దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. పోలీసులు.. 10 గంటల తర్వాత వ్యాపార సముదాయాలను మూసి వేయించారు. గడువు సమయం దాటిన తరువాత దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.