కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొవిడ్ కట్టడికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై తిరిగే వారిని ఇక ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తామని అడ్మిన్ ఎస్పీ వైవీ.సుధీంద్ర పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై రిజర్వుడ్ ఇన్స్ పెక్టర్ శేఖర్ బాబు, ఎస్సై రాజేశ్వర్లతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
Lockdown: 'అనవసరంగా బయటికొస్తే ఐసోలేషన్ సెంటర్‌కే' - Komuram bheem distric lockdown
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొవిడ్ కట్టడికి పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై తిరిగే వారిని అడ్మిన్ ఎస్పీ సుధీంద్ర ఐసోలేషన్ కేంద్రానికి తరలించి.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
Lockdown in asifabad komuram bheem distric
అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 16 మందిని పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఐసోలేషన్ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. 16 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు సడలింపు సమయంలోనే పనులు ముగించుకోవాలని పేర్కొన్నారు. పాసులు లేకుండా ఎవరు బయట వచ్చిన కఠిన చర్యలు తప్పవన్నారు.