తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పురపాలక చట్టంతో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయనుంది. క్రమబద్ధీకరణ అనుమతి లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాగజ్‌నగర్ పురపాలికలో అనుమతులు లేని రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కాగజ్‌నగర్‌లో అనుమతులు లేని రిజిస్ట్రేషన్ల నిలిపివేత - land registration done after prior permissions from officers
తెలంగాణలో నూతన పురపాలక చట్టం ప్రకారం పురపాలక పరిధిలో ఎల్ఆర్ఎస్ అనుమతి ఉన్న ప్లాట్లకు, స్థలాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాగజ్‌నగర్ పురపాలికలో అనుమతులు లేని రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కాగజ్‌నగర్‌లో అనుమతులు లేని రిజిస్ట్రేషన్ల నిలిపివేత
నూతన చట్టం ప్రకారం పురపాలక పరిధిలోని రెండు ఎకరాల స్థలానికి ఎల్ఆర్ఎస్ అనుమతి కోసం కలెక్టర్, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి అనుమతులు పొందాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అలా అనుమతులు లేని లేఅవుట్ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది.