కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో శుక్రవారం 5 పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అందరూ మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలని ప్రచారం చేస్తున్నారు.
'మాస్కు ధరించకుంటే జరిమానా తప్పదు' - కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో మాస్కు ధరించని వారికి జరిమావా
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కుమురంభీం జిల్లా అధికారులు వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారికి జరిమానా విధిస్తున్నారు.
'మాస్కు ధరించకుంటే జరిమానా తప్పదు'
పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాస్క్ ధరించకుండా బయట తిరుగుతున్న పలువురికి పురపాలక సిబ్బంది రూ.1000 చొప్పున జరిమానా విధించారు. కరోన వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అందరూ కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని.. అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు
TAGGED:
కుమురంభీం జిల్లా తాజాా వార్త