కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వైద్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి సందీప్‌కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జనకపూర్, రైల్వేస్టేషన్, బస్టాండ్లలో పకడ్బందీగా పరీక్షలు చేయాలన్నారు. గోలేటి క్వారంటైన్ కేంద్రంలో 17 మంది, సింగరేణి ఐసోలేషన్‌లో 23 మంది, వాంకిడి క్వారంటైన్లో 21, ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 51, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 28 మంది కొవిడ్ అనుమానితులు ఉన్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో పకడ్బందీ కరోనా పరీక్షలు చేయాలి: కలెక్టర్ - kumurambheem asifabad district news
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పకడ్బందీ కరోనా పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 196 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు.
జిల్లాలో పకడ్బందీ కరోనా పరీక్షలు చేయాలి: కలెక్టర్
ఇప్పటి వరకు జిల్లాలో 3052 నమూనాలను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించగా... 196 పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. 2721 మందికి నెగెటివ్ వచ్చిందని, 135 మంది ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు పాలనాధికారి రాంబాబు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా సోకిన కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షుడు సాయం