తెలంగాణ

telangana

ETV Bharat / state

వాహనదారులకు పోలీసుల అవగాహన - lockdown effect in kumuram bheem asifabad

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.

kumuram bheem asifabad police awareness program
వాహనదారులకు పోలీసుల అవగాహన

By

Published : May 22, 2021, 12:40 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లాక్​డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనదారులను పోలీసులు ఆపి... జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలను జప్తు చేస్తున్నారు.

అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సీఐ ఆకుల అశోక్ సూచించారు. అనవసరంగా బయటకు వచ్చి కరోనా మహమ్మారికి బలికావొద్దన్నారు. మాస్కు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తేనే కరోనాను కట్టడి చేయొచ్చని తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details