కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లను... పాలనాధికారి రాహుల్ రాజ్ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్ 60 మందికి వ్యాక్సిన్ ఇవ్వనుండగా... ఒక్కో కేంద్రంలో 30 మందికి చొప్పున టీకా ఇవ్వనున్నారు.
వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి: కలెక్టర్ - కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించి కలెక్టర్ రాహుల్ రాజ్
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ నేడు ప్రారంభ కానున్న నేపథ్యంలో... కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పంపిణీ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి: కలెక్టర్
టీకా తీసుకున్న అనంతరం ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే అత్యవసరంగా వైద్యం అందించేందుకు తగిన కిట్లతో పాటు వైద్య బృందాలను అధికారులు సంసిద్ధం చేశారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సునీల్ రావు, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, డాక్టర్ చక్రపాణి, తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి:కరోనా మహమ్మారిపై సమరం.. నేటి నుంచి వ్యాక్సినేషన్