కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్రవాగును జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. భారీగా కురిసిన వర్షంతో వాగు ఉప్పొంగింది. చింతకర్రవాగులో నిన్న 30 మంది చిక్కుకున్నారు. వారిని అతికష్టం మీద సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చింతకర్ర, కిషన్‌నాయక్ తండా, తాడిగూడ ప్రజలు కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని జిల్లా పాలనాధికారిని వేడుకున్నారు.
Asifabad: జైనూరులోని చింతకర్రవాగుపై తాత్కాలిక వంతెన: కలెక్టర్ - చింతకర్ర వాగుపై తత్కాలిక వంతెన నిర్మాణానికి కలెక్టర్ హామీ
జైనూర్ మండలంలోని చింతకర్రవాగుపై తాత్కాలిక వంతెన నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో వాగు పొంగగా.. నిన్న 30 మంది అందులో చిక్కుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
జైనూరులోని చింతకర్రవాగుపై తాత్కాలిక వంతెన: కలెక్టర్
ఈ వానాకాలం వెళ్లేవరకు వాగు మధ్యలో తాత్కాలికంగా పైపులు వేసి మొరంతో రోడ్డు సౌకర్యం కల్పిస్తామని జిల్లా పాలనాధికారి హామీ ఇచ్చారు. అలాగే ఏఈతో చర్చించి విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామన్నారు. తహసీల్దార్‌తో మాట్లాడి కిషన్‌నాయక్ తండాలో రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నుంచి వంతెన పనులు, బి.టి రోడ్డు పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ అన్నారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా