కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇంఛార్జ్ ఎస్పీ వి.సత్యనారయణ ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి వాహనాల రద్దీ పెరిగిందని జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ వి.సత్యనారయణ అన్నారు. రద్దీతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియటంతో సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంను ప్రారంభించిన కలెక్టర్, ఇంఛార్జ్ ఎస్పీ - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తాజా వార్తలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇంఛార్జ్ ఎస్పీ వి.సత్యనారయణ ప్రారంభించారు. ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంతో ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంను ప్రారంభించిన కలెక్టర్, ఇంఛార్జ్ ఎస్పీ
జాతీయ రహదారులపై వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జాతీయ రహదారులపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే అవకాశం లేదని.. అందుకే అప్రోచ్ రోడ్లు, లింక్ రోడ్ల వద్ద ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!