తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దులో చెక్​పోస్టు తనిఖీ చేసిన ఎస్పీ - సరిహద్దు చెక్​పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ

కుమురం భీం జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్​పోస్టులను జిల్లా ఎస్పీ వైవీఎస్​ సుధీంద్ర తనిఖీలు చేశారు. లాక్​డౌన్ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.

Telangana news
kumaram bheem district

By

Published : May 26, 2021, 8:52 PM IST

కుమురంభీం జిల్లాలో లాక్​డౌన్​ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో లాక్​డౌన్​ అమలును ఎస్పీ వైవీఎస్​ సుధీంద్ర పర్యవేక్షిస్తున్నారు. బుధవారం జిల్లాలోని సరిహద్దుల వద్ద చెక్​పోస్టులను తనిఖీ చేశారు. సిర్పూర్ టి మండలంలోని వెంకట్రావ్ పేట, జక్కపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్​పోస్టులను తనిఖీ చేశారు.

అంతరాష్ట్ర రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనాల వివరాలు తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అకారణంగా వస్తున్న వారిని అనుమతించొద్దని సిబ్బందికి సూచించారు. అత్యవసర కారణాలతో వచ్చేవారిని ఈపాస్ కలిగి ఉండి కొవిడ్​ నిబంధనలు పాటిస్తేనే అనుమతించాలని తెలిపారు.

ఇదీ చూడండి:పౌరసరఫరాల శాఖలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​

ABOUT THE AUTHOR

...view details