తెలంగాణ

telangana

ETV Bharat / state

జలకళ సంతరించుకున్న కుమురం భీం, వట్టివాగు జలాశయాలు - కుమురం భీం ప్రాజెక్టు తాజా వార్తలు

ఆసిఫాబాద్​ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కుమురం భీం, వట్టి వాగు జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటం వల్ల అధికారులు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు.

Kumaram Bhim and Vattivagu reservoirs are famous for their water art
జలకళ సంతరించుకున్న కుమురం భీం, వట్టివాగు జలాశయాలు

By

Published : Aug 16, 2020, 11:14 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు కుమురం భీం, వట్టివాగు జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరి.. నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

కుమురం భీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 241.500 మీటర్లుగా ఉంది. వట్టివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 238.450 మీటర్లుగా ఉంది. ఇన్ ఫ్లో 390 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది.

ఇదీచూడండి: త్వరలో నిండుకుండలా శ్రీశైలం!

ABOUT THE AUTHOR

...view details