తెలంగాణ

telangana

పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజుకు సన్మానం

ఆదివాసుల సంప్రదాయ గుస్సాడి నృత్యానికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కనకరాజుకు పద్మశ్రీ పురష్కారం దక్కడం పట్ల ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుమురం భీం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికారుల కనకరాజును సన్మానించారు.

By

Published : Jan 26, 2021, 6:17 PM IST

Published : Jan 26, 2021, 6:17 PM IST

పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజుకు సన్మానించిన జిల్లా అధికారులు
పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సన్మానించిన జిల్లా అధికారులు

గుస్సాడి నృత్య శిక్షకుడు కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారం ప్రకటించడం పట్ల ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమరంభీం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధికారులు కనకరాజును సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాహుల్​ రాజ్​, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు... గుస్సాడి నృత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. ఎంతో మందికి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వారికి గుస్సాడిలో తర్ఫీదు నిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ముందు గుస్సాడి నృత్యం ప్రదర్శించడమే కాకుండా... ఆమెతో నాట్యం కూడా చేయించారు.

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలంగాణ నుంచి కనకరాజుకు మాత్రమే పద్మశ్రీ అవార్డు లభించింది. ఆదివాసీలను గుర్తించి ఈ అవార్డును ఇవ్వటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని కనకరాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆదివాసి సంప్రదాయాలను, సంస్కృతులను కాపాడటంలో ముందు ఉంటానని తెలిపారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సన్మానించిన జిల్లా అధికారులు

ఇదీ చూడండి:కొత్త సచివాలయ పనులను పరిశీలించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details