కుమురం భీం జిల్లా జోడేఘాట్లో 50 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి ఆరేళ్లు పైనే అయిందని స్థానికులు వాపోతున్నారు. తరతరాలుగా సరైన వసతి లేక మట్టింటిలోనే జీవనం నెట్టుకొస్తున్న తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని వేడుకుంటున్నారు.
మా ఊర్లో అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని సీఎం సారు చెప్పిండు. ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా పునాది పడలేదు. అందరం గూన పెంకుల ఇండ్లు, గుడిసెల్లో ఉంటున్నాం. వానొచ్చినప్పుడు దారలు కురుస్తున్నాయి. నీటికి తడిచిన గోడలు కూలతున్నాయి. మట్టితో కట్టిన ఇల్లు.. గట్టి వాన పడితే కూలిపోతాయని బుగులు ఐతంది.
సోంబాయి-కొమురం భీం మనమరాలు
ఇల్లు కాదు కదా... పునాది కూడా పడలేదు
జల్, జంగల్, జమీన్ కోసం నిజాం సేవ సేనలపై తిరగబడ్డ వీరుడు కొమురం భీం.. పోరుగడ్డ జోడేఘాట్లో 50 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్, 2016లో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ నేటికి ఇల్లు కాదుకదా.. పునాది కూడా పడలేదు. సాక్షాత్తు కుమరంభీం మనుమరాలుతో సహా 50 కుటుంబాలు మట్టిళ్లలోనే జీవనం నెట్టుకొస్తున్నారు.