ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు జలకళను సంతరించుకున్నాయి. ఇంకేముంది.. ప్రజలు పెద్ద సంఖ్యలో వాగుల వద్ద, చెరువుల వద్ద చేపలు పడుతూ సందడి చేస్తున్నారు.
Fish hunt: వలలే అవసరం లేదు... దోమ తెరలే చాలు
పట్టుకున్నవారికి పట్టుకున్నన్ని.. దొరికిన వారికి దొరికినన్ని. వలలే అవసరం లేదు. దోమ తెరలే చాలు. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా..? చేపల వేటకు. వర్షం జోరుగా కురిసింది. వాగులు పొంగి పొర్లాయి. ఇంకేముంది.. వాగుల వద్ద ప్రత్యక్షమయ్యారు చుట్టు పక్కల గ్రామస్థులు. కేజీల కొద్దీ చేపలు పట్టుకుని ఇళ్లకు వెళ్తున్నారు.
పొంగిన వాగులు.. దొరికిన చేపలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిక్లి వాగు ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా పోటెత్తుతుంది. మత్తడిపై నుంచి వచ్చే వరద నీటిలో చేపలు కొట్టుకు రావడంతో చుట్టుపక్కల గ్రామాల వారు కిలోల కొద్ది చేపలు పట్టుకుంటున్నారు. వందలాది మంది ప్రాజెక్టు వద్దకు వచ్చి చేపలను పడుతూ.. సరదాగా గడుపుతున్నారు.
ఇదీ చూడండి:కొత్తగా గ్రీన్ ఫంగస్.. లక్షణాలు ఇలా...