కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇప్పుడు తెలంగాణ కాశ్మీర్ కానుందని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ అన్నారు. జిల్లాలోని కెరిరమెరి మండలంలో ఆపిల్ సాగు చేసిన బాలాజీ అనే రైతును అభినందిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అందరి రైతుల్లా కాకుండా.. విభిన్నంగా ఆలోచించి.. ముఖ్యమంత్రి మాటలను స్ఫూర్తిగా తీసుకున్న బాలాజీ ఆపిల్ పంట వేసి మంచి దిగుబడి సాధించాడు.
'బాలాజీ ఆపిల్‌ను జయించాడు'
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువరైతు ఆపిల్ సాగు చేసి.. ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచాడు. కాశ్మీర్ ఆపిల్లా తెలంగాణ యాపిల్ కూడా ప్రపంచమంతా విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను నిజం చేస్తూ జిల్లాకు చెందిన బాలాజీ ఆపిల్ సాగులో విజయవంతమయ్యాడు.
జిల్లాలో ఆపిల్ సాగు చేసి విజయం సాధించిన బాలాజీని జిల్లా పాలనాధికారి అభినందించారు. ఆపిల్ సాగు చేసి.. కుమురం భీం జిల్లాను తెలంగాణ కాశ్మీర్‌గా మార్చేశారని.. దేశంలో ఆపిల్ కావాలంటే కాశ్మీర్ పేరు చెప్పుకున్నట్టే.. తెలంగాణలో ఆపిల్ పేరెత్తగానే.. జిల్లా పేరే గుర్తు వస్తుందని ఆయన అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని వైవిధ్యమైన పంటలు పండించాలని బాలాజీకి సూచించారు. బాలాజీ ఆపిల్ సాగుపై సినీ గేయ రచయిత చంద్రమౌళి రాసిన ‘అతడు ఆపిల్‌ను జయించాడు – కెరిమెరి తోట.. ఆపిల్ పాట’కు సంబంధించిన గోడ ప్రతులను పాలనాధికారి ఆవిష్కరించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా