తెలంగాణ

telangana

ETV Bharat / state

ముసలవ్వకు సాయం చేసిన పోలీసులు - కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముసలమ్మకు సాయం చేసిన ఎస్ ఐ

లాక్ డౌన్ నియమాలు తెలియక ఓ వృద్ధురాలు మార్కెట్ కు వచ్చింది. నిత్యావసరాలు కొనుక్కుని ఇంటికి వెళ్దామనుకుంటే ఒక్క బస్సు, ఆటో రాకపోయేసరికి దిక్కుతోచని స్థితిలో బస్టాండ్ లోనే ఉండిపోయింది. వృద్ధురాలు పరిస్థితిని తెలుసుకున్న ఓ పోలీస్ అధికారి వృద్ధురాలి అవస్థ తెలుసుకుని ఇంటికి పంపించి మంచి మనసు చాటుకున్నాడు.

kourtam si
kourtam si

By

Published : May 14, 2021, 6:38 PM IST

లాక్ డౌన్ నియమాలు తెలియక బస్టాండ్​లో చిక్కుకుపోయిన ముసలవ్వను ఇంటికి పంపించి సేవాగుణాన్ని చాటుకున్నాడు ఓ పోలీస్ అధికారి. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విర్దండి గ్రామానికి చెందిన ముసలవ్వ… కౌటాల మండల కేంద్రానికి వచ్చి సరుకులు తీసుకుంది. తీరా ఇంటికి వెల్ధామని చూడగా ఒక్క బస్సు కానీ ఆటో కానీ కనిపించలేదు. ఏం చేయాలో తోచక ఆ ముసలవ్వ సుమారు రెండు గంటల పాటు అలాగే బస్టాండ్ లో ఎదురుచూడసాగింది.

సమాచారం తెలుసుకున్న కౌటాల సీఐ బుద్దె స్వామి.. అవ్వ వివరాలు కనుక్కున్నాారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అవ్వ పరిస్థితి గమనించి.. ఆటో ఏర్పాటు చేసి ఇంటికి పంపించి తన మంచి మనసు చాటుకున్నాడు. లాక్ డౌన్ అమలులో ఉన్నంత వరకు 10 గంటల తరువాత రవాణా సౌకర్యం ఉండదని.. త్వరగా పనులు ముగించుకుని వెళ్లాలని బుద్దె స్వామి ప్రజలను కోరారు.

ఇదీ చూడండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details