తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమురంభీం జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్​‌కు కరోనా - రాహుల్‌రాజ్​‌కు కరోనా

కుమురంభీం జిల్లా పాలనాధికారి రాహుల్‌రాజ్​‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆదిలాబాద్​ జిల్లాకు కూడా రాహుల్​రాజ్​ పాలనాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆసిఫాబాద్‌లోని అధికారిక నివాసంలోనే రాహుల్​రాజ్​ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొవిడ్​ నుంచి కోలుకుని త్వరలోనే విధుల్లో చేరుతానని​‌ తెలిపారు.

komaram bheem asifabad district collector tested positive
komaram bheem asifabad district collector tested positive

By

Published : Apr 16, 2021, 7:56 PM IST

ఆదిలాబాద్‌, కుమురంభీం జిల్లా పాలనాధికారి రాహుల్‌రాజ్​‌కు కరోనా సోకింది. ఆదిలాబాద్‌ పాలనాధికారిగా పనిచేసిన సిక్తా పట్నాయక్‌ ఈనెల 7 నుంచి సెలవుపై వెళ్లగా... ఆమె స్థానంలో అదే రోజు ఎఫ్‌ఏసీగా రాహుల్​రాజ్‌ బాధ్యతలు చేపట్టారు. కరోనా బారిన పడిన రాహుల్​​రాజ్... ప్రస్తుతం ఆసిఫాబాద్‌లోని అధికారిక నివాసంలోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కొవిడ్​ నుంచి కోలుకుని త్వరలోనే విధుల్లో చేరుతానని రాహుల్​రాజ్​‌ తెలిపారు.

సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున... ఆదిలాబాద్‌, కుమురంభీం జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. జ్వరం, ఒళ్లునొప్పులుంటే నిర్లక్ష్యం చేయకుండా... సమీప ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కరోనా పరీక్షలు చేసుకోవాలన్నారు. 45 ఏళ్ల వయస్సు పైబడిన వారు తప్పనిసరిగా కరోనా టీకాలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: టీకా రెండు డోసులు తీసుకున్నా.. కరోనా బారిన పడిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details