తెలంగాణ

telangana

ETV Bharat / state

నన్నెవరూ కిడ్నాప్​ చేయలేదు: సిడాం జగన్నాథరావు - asifabad

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని మండలంలో కిడ్నాప్ కలకలం రేపింది. తిర్యాని నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తున్న సిడాం జగన్నాథరావును కిడ్నాప్​ చేసినట్లు పుకార్లు వచ్చాయి. ఇదంతా అధికార పార్టీ కుట్రలని ఆయన దుమ్మెత్తిపోశారు.

నన్నెవరూ కిడ్నాప్​ చేయలేదు

By

Published : May 3, 2019, 12:16 PM IST

Updated : May 3, 2019, 12:38 PM IST

నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని తిర్యాని జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి సిడాం జగన్నాథరావు తెలిపారు. మెుదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తనను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ తన భార్యపై కొందరు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయించారని చెప్పారు. తమ పార్టీ నాయకులే తనను ఎందుకు కిడ్నాప్ చేస్తారని ప్రశ్నించారు. ఏకగ్రీవం కోసం తెరాస నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల ఇలా కిడ్నాప్ నాటకమాడుతున్నారని విమర్శించారు.

నన్నెవరూ కిడ్నాప్​ చేయలేదు
Last Updated : May 3, 2019, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details