తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణ లక్ష్మి ఓ వరం' - కాగజ్​నగర్​లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసన సభ్యుడు కోనేరు కోనప్ప కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

Kalyana laxmi cheques
కల్యాణ లక్ష్మి ఓ వరం

By

Published : Dec 5, 2019, 8:21 PM IST

పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని సిర్పూర్ కాగజ్​నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని 434 మంది లబ్ధిదారులకు 4.23 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సీఎం ఏదో ఒక రూపంలో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, జిల్లా కో- ఆప్షన్ మెంబర్ సిద్దిక్, ఎంపీపీ శంకర్, తహసీల్దార్లు యుగేందర్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్​నగర్​లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఇదీ చూడండి: దిశ సెల్‌ఫోన్​ను గుర్తించిన పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details