కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణా రావు.. కాగజ్ నగర్‌లో మండల, పట్టణ పరిసర గ్రామాల్లోని 245 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల 45 లక్షల 28 వేల 420 చెక్కులను అందజేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. తీవ్రమైన కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ ఫలాలను పేదలకు అందేలా కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 796 మంది లబ్ధిదారులకు చెక్కులు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం కాగజ్ నగర్ మండలంలోని వారికి అందజేస్తున్నామని పేర్కొన్నారు. మిగితా 6 మండలాల్లో త్వరలొనే అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఎంపీ నామ