తెలంగాణ

telangana

ETV Bharat / state

చేతులు లేకున్నా... చైతన్యం చూపాడు - kalitho vote vesina divyangudu

రెండు చేతులూ లేకున్నా ఓటు హక్కును వినియోగించుకున్నాడు ఓ యువకుడు. పోలింగ్ కేంద్రంలో కాలితోనే సంతకం చేసి, సిరా వేయించుకొని ఓటేశాడు.

kalitho-vote

By

Published : Apr 12, 2019, 1:11 PM IST

అన్ని అవయవాలు సవ్యంగా ఉండి కూడా ఓటు వేయడానికి బద్ధకించే వారుంటారు. రెండు చేతులు లేకపోయినా... ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో తనవంతు పాత్రగా ఓటేశాడు ఓ యువకుడు.

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణానికి చెందిన జకీర్ పాషాకు రెండు చేతులు లేవు. అయినా వైకల్యాన్ని లెక్క చేయకుండా ఓటింగ్​లో పాల్గొని ఆదర్శంగా నిలిచాడు. కాలితో ఓటేసి తన బాధ్యతను నిర్వర్తించాడు. మిగతా వారికి గుర్తు చేశాడు.

కాలితో ఓటు

ఇదీ చూడండి: రాష్ట్రంలో 62.25 శాతం పోలింగ్​ నమోదు: ఈసీ

ABOUT THE AUTHOR

...view details