తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిశుభ్రతతోనే కరోనా కట్టడి సాధ్యం' - కాగజ్​నగర్ మున్సిపల్ ఛైర్మన్​ చెత్తబుట్టల పంపిణీ

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు పరిశుభ్రత పాటించాలని కాగజ్​నగర్​ మున్సిపల్​ ఛైర్మన్​ సద్దాం హుస్సేన్​ అన్నారు. పట్టణంలోని సుభాష్​ కాలనీలో కౌన్సిలర్​తో కలిసి ఇవాళ చెత్తబుట్టలు పంపిణీ చేశారు.

kagaznagar muncipal chairmen saddam hussain distributes trash tubs in  subhash colony
కరోనా వ్యాప్తి నివారణకు పరిశుభ్రత పాటించాలి

By

Published : May 26, 2020, 10:15 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లోని సుభాష్ కాలనీలో మున్సిపల్ ఛైర్మన్​ సద్దాం హుస్సేన్​ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి రెండు చెత్త బుట్టలు అందించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పాటించాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జూపక మదన్​, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details