తెలంగాణ

telangana

ETV Bharat / state

అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యేలు - kagaznagar mla koneru konappa b-form distribution to candidates

కాగజ్‌నగర్ మున్సిపల్‌ ఎన్నికల తెరాస అభ్యర్థులకు ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు బీ-ఫామ్‌లు అందజేశారు. టికెట్లు రాని వారు పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.

అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యేలు
అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యేలు

By

Published : Jan 14, 2020, 6:00 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పురపాలిక తెరాస అభ్యర్థులకు ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు బీ-ఫామ్‌లు అందజేశారు. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేసినప్పటికీ... అందరినీ సమన్వయపరిచి ఉపసంహరించుకునేలా ఒప్పించారు.

నామినేషన్ వేసిన వారితో కోనేరు కోనప్ప నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. పోటీ నుంచి విరమించుకొని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యేలు

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: గద్వాల సంస్థానంలో పుర సమరం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details