కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీనివల్ల రోజూకూలీ పని చేసుకుని బతికే పేదప్రజలు తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకొస్తున్నారు.
పేదల ఆకలి తీరుస్తున్న ప్రజాప్రతినిధులు - corona in kagaznagar
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదల ఆకలి తీర్చేందుకు పలువురు ప్రజా ప్రతినిధులు ముందుకొస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తూ చేయూతనిస్తున్నారు.
పేదల ఆకలి తీరుస్తున్న ప్రజాప్రతినిధులు
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ వనమాల విజయారాము తన మిత్ర బృందం సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు తన వార్డులోని పేద ప్రజలతో పాటు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో ఈ సరుకులు అందజేయనున్నట్లు తెలిపారు.
TAGGED:
corona in kagaznagar