మొక్కలు నాటిన కాగజ్‌నగర్ పుర పాలకవర్గం - కాగజ్‌నగర్‌లో హరితహారం
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పాలకవర్గం హరితహారం నిర్వహించారు. ఎల్లాగౌడ్ తోటలోని పిల్లల ఉద్యాన వనంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు పాల్గొని మొక్కలు నాటారు.
KAGAJNAGAR COUNCIL PLANTS PLANTED
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పాలకవర్గం మొక్కలు నాటారు. కాగజ్గర్ ఎల్లాగౌడ్ తోటలోని పిల్లల ఉద్యానవనంలో నిర్వహించిన కార్యక్రమానికి ఛైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ ఛైర్మన్ గిరీష్ కుమార్ హాజరయ్యారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని ఛైర్మన్ సద్దాం హుస్సేన్ తెలిపారు. ప్రతి కౌన్సిలర్ విధిగా ఒక మొక్క నాటి సంరక్షించాలని ఛైర్మన్ కోరారు.