దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాక్‌లో విధులు నిర్వహిస్తున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన జవాన్ షాకిర్ హుస్సేన్ మృతి చెందాడు. ఆరుగురు సభ్యుల బృందం విధులు ముగించుకుని బేస్ క్యాంప్‌నకు తిరిగివస్తుండగా... ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్టు హుస్సేన్ కుటుంబసభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు.
లద్ధాఖ్‌లో కొండ చరియలు విరిగిపడి జవాన్ మృతి - లద్ధాఖ్‌లో జవాన్ షాకిర్ హుస్సేన్ మృతి
లద్ధాఖ్‌లో విధులు నిర్వహణలో భాగంగా... కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన షాకిర్ హుస్సేన్ అనే జవాన్ మృతి చెందాడు. విధులు ముగించుకొని తిరిగి బేస్ క్యాంపునకు తిరిగి వస్తుండగా కొండ చరియలు విరిగి ప్రమాదం సంభవించినట్టు ఆర్మీ అధికారులు... కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
కొండ చరియలు విరిగి లద్ధాఖ్‌లో జవాన్ మృతి
ఆర్మీ జవాన్ షాకిర్ హుస్సేన్ మృతితో పట్టణంలోని రిక్షా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. షేక్ హుస్సేన్, జంశిత్ సుల్తానా కుమారుడైన షాకిర్ హుస్సేన్ 2001 లో ఆర్మీలో చేరాడు. 2021లో ఉద్యోగ విరమణ ఉంది. గత ఫిబ్రవరిలో సెలవుపై ఇంటికి వచ్చి వెళ్లాడు. హుస్సేన్‌కు భార్య లిఖత్ సుల్తానా, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. దేశ రక్షణలో అమరుడైన తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా అందజేయాలని తండ్రి షేక్ హుస్సేన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.