కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో అటవీ శాఖ అధికారులపై అధికార పార్టీ నాయకుల దాడిని తెలంగాణ జనసమితి ఖండించింది. ప్రభుత్వంతో మాట్లాడి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయవలసిన నాయకులు.. అధికారులను బాధ్యులను చేయడం శోచనీయమని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. పోడుభూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టప్రకారం ఆదివాసీలకు ఉన్న హక్కులను గుర్తించకుండా... అడవుల రక్షణ సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు.
అధికారులను బాధ్యులను చేయడం శోచనీయం - SCHEDULED TRIBE
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయవలసిన నాయకులు.. అధికారులను బాధ్యులను చేయడం శోచనీయమని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు.
అడవుల రక్షణ సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తించాలి : కొదండరాం