తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో అంతర్రాష్ట్ర దొంగలు పట్టివేత​ - 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ రైల్వే స్టేషన్​లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 16 వేల నగదు, 4 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు.

2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో అంతర్రాష్ట్ర దొంగలు పట్టివేత​

By

Published : Nov 27, 2019, 9:03 AM IST

Updated : Nov 27, 2019, 10:11 AM IST

కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో అంతర్రాష్ట్ర దొంగలు పట్టివేత​
కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము మధ్యప్రదేశ్​కు చెందినట్లుగా చెప్పారని జీఆర్పీ సీఐ స్వామి తెలిపారు.

అనంతరం వారి బ్యాగులు తనిఖీ చేయగా 2 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, 16 వేల నగదు, నాలుగు చరవాణీలు లభ్యమయ్యాయని సీఐ వెల్లడించారు. నిందితులైన ఆశిష్​ గుప్త, వినోద్​ గోస్వామిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

Last Updated : Nov 27, 2019, 10:11 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details