కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచెవెళ్లిలో విషాదం జరిగింది. ప్రేమించిన యువకుడితో వివాహం జరగదేమోనని.. ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. గతేడాది వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. పంచాయితీ పెట్టి బాలిక మైనర్ అవ్వడం వల్ల మేజర్ అయ్యాక వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. యువకుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి పోయాడు. తాను ప్రేమించిన వాడితో ఎక్కడ వివాహం జరగదేమోనని ఆందోళనతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.
ప్రియుడితో పెళ్లి జరగదనే భయంతో బాలిక ఆత్మహత్య - ప్రేమ వివాహం జరగదనే ఆందోళనతో మైనర్ బాలిక ఆత్మహత్య
ప్రేమించిన యువకుడితో వివాహం జరగదేమోన్న ఆందోళనతో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుమురం భీం జిల్లా, దహెగాం మండలం కొంచెవెళ్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమ వివాహం జరగదనే ఆందోళనతో మైనర్ బాలిక ఆత్మహత్య
Last Updated : Nov 21, 2019, 2:13 PM IST