తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలుస్తారా: ఇంద్రకరణ్​ - minister'

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు ఎంపీగా గెలుస్తారా అని ఎద్దేవా చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో జరిగిన తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఇంద్రకరణ్​ రెడ్డి

By

Published : Apr 2, 2019, 8:01 PM IST

ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలుస్తారా: ఇంద్రకరణ్​
లోక్​సభ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఇప్పుడు ఎంపీలుగా గెలుస్తారా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. సీఎం కేసీఆర్​ 7న నిర్మల్​ వస్తున్నారని తెలిపారు. గులాబీ దళపతి పర్యటన విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్​ తెరాస ఎంపీ అభ్యర్థి గోడెం నగేశ్​, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details