ప్రభుత్వం.. ఐసోలేషన్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పినప్పటికి... క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవంటూ కొవిడ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి.. మందులు, పౌష్టిక ఆహారం అందించడం లేదంటూ కుమురం భీం జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతోన్న బాధితులు వాపోతున్నారు. డాక్టర్లు.. కనీసం గదుల్లోకి వచ్చి కూడా చూడటం లేదని మండిపడుతున్నారు.
ఐసోలేషన్ కేంద్రాల్లో అసౌకర్యాల చింత - kumaram bheem district covid cases
కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రంలో.. తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటూ కొవిడ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది.. తమను చిన్న చూపు చూస్తున్నారని వాపోతున్నారు. పౌష్టికాహారం కాదు కదా.. కనీసం మందులైనా సమయానికి ఇవ్వడం లేదంటున్నారు.
![ఐసోలేషన్ కేంద్రాల్లో అసౌకర్యాల చింత Inconveniences at isolation centers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:13:25:1621313005-11795069-ashifabad.jpg)
Inconveniences at isolation centers
కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా.. వైద్య సిబ్బంది తమను చిన్న చూపు చూస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేంద్రంలో.. వారం రోజుల క్రితం ఇద్దరు కొవిడ్ పేషెంట్లు మరణించారు. వారి మరణాలకు.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించడం గమనార్హం.
ఇదీ చదవండి:కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి