తెలంగాణ

telangana

ETV Bharat / state

సంకల్పబలంతో విధిరాతను జయించి.. - Ideally a standing young man

విధిరాతను సంకల్పబలంతో జయించి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. ఓ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినా... కృత్రిమ కాళ్లతో సొంత పనులతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

సంకల్పబలంతో విధిరాతను జయించి..
సంకల్పబలంతో విధిరాతను జయించి..

By

Published : Aug 3, 2020, 12:23 PM IST

విధిరాతను సంకల్పబలంతో జయించి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. కుమురం భీం జిల్లా కౌటాల మండలం గురుడు పేటకు చెందిన నికాడే విష్ణుమూర్తి డిగ్రీ వరకు చదివారు. నాలుగేళ్ల కిందట వరి ధాన్యం కుప్పలను క్రషర్ లో వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రషర్ చక్రాల్లో కాళ్లు పడ్డాయి. మోకాళ్ల వరకు చిద్రమైపోయాయి.

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. జర్మన్ సాంకేతికతతో తయారైన రెండు కృత్రిమ కాళ్లను అమర్చేలా కృషి చేశారు. తన వంతు సహాయం చేసి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. కృత్రిమ కాళ్లతో తిరిగి కొత్త జీవితం ప్రారంభించిన విష్ణుమూర్తి మొదట్లో ఆరునెలలు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం అన్ని వ్యవసాయ పనులు సొంతంగా చేస్తున్నారు. ద్విచక్ర వాహనంతో పాటు ట్రాక్టర్ ను కూడా నడుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details